Mobile Popup Ad
Mobile Popup Ad

అన్న అలా.. చెల్లి ఇలా.. KTR, కవిత పెద్ద ప్లానింగే!!

కలం, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేండ్లకు పైగానే టైమ్ ఉన్నది. కానీ, అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే యాక్షన్‌లోకి దిగాయి. అధికారం కోల్పోయిన పార్టీకి తిరిగి ప్రతిష్టను తీసుకురావాలని కేటీఆర్ (KTR) ప్రయత్నిస్తున్నారు. కొత్తగా పెట్టిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాలని కల్వకుంట్ల కవిత (Kavitha) భావిస్తున్నారు. అన్నాచెల్లెలు (KTR – Kavitha) పోటాపోటీగా జనంలోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. చెల్లెలు ఇప్పటికే జనం బాట ఫస్ట్ ఫేజ్‌ను 20 జిల్లాల్లో కంప్లీట్ చేశారు. సింగరేణి కార్మికులను కలిసేందుకు ‘బాయి బాట’ పేరుతో బొగ్గుబావుల ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వచ్చే సంవత్సరంలో రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. అన్న కేటీఆర్ తన పాదయాత్ర రోడ్‌మ్యాప్ ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టకముందే.. చెల్లెలు కవిత షెడ్యూల్ ప్రకటించి స్పీడ్ పెంచుతున్నారు. కొత్తగా పెట్టిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కవిత.. కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందాలని కేటీఆర్ జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు.

పొలిటికల్ ఇంటెన్షన్ ఒక్కటే!

అన్న, చెల్లి లక్ష్యం క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల్లో తిరుగుతూ తమ తమ పార్టీలను బలోపేతం చేసి అధికారంలోకి రావడమే. ఢిల్లీ లిక్కర్ కేసు వివాదాలు, అరెస్ట్, జైలు జీవితం లాంటి పరిణామాల తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఢిల్లీ స్థాయి పాలిటిక్స్ విధానం పనికిరాదనుకున్నారు. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కావొద్దనుకున్నారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే ఏకైక మార్గమనుకున్నారు. అందులో భాగంగా రెండు నెలల పాటు ఇరవై జిల్లాల్లో ‘జనం బాట’ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారం కోసం ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో లోపాలు, ప్రజల ఇబ్బందులు.. వీటిని హైలైట్ చేస్తూ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.

కవిత బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య’ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగారు. అప్పట్లో కార్మిక సంఘం నాయకులతో సమావేశమయ్యేవారు. ఇప్పుడు కొత్త పార్టీ టిఆర్ఎస్‌ను స్థాపించారు. అప్పటి పాపులారిటీని బలోపేతం చేసుకోవడం, కొత్తగా పార్టీ కేడర్‌ను తయారుచేసుకోవడం, కార్మికుల్లో పట్టును సాధించడంపై ఫోకస్ పెట్టారు. జూన్ 15 నుంచి ‘బాయి బాట’ చేపట్టనున్నారు.

‘ఇమేజ్ మేకోవర్ – లీడర్‌షిప్ ఎస్టాబ్లిష్‌మెంట్’ ఫార్ములాకు తగినట్లుగా కేటీఆర్ తనదైన శైలిలో జనంలోకి వెళ్లడానికి పాదయాత్రకు రెడీ వుతున్నారు. వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు, అందులోని పోస్టులకే స్పందిస్తారు.. అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. అలాంటి ‘హైటెక్ ఇమేజ్’ను ‘మాస్ ఇమేజ్’గా మార్చుకోవాలని కేటీఆర్ జనంబాటకు సిద్ధమవుతున్నారు.

ఓటు బ్యాంకు, మైలేజ్..!

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ అప్పటి 23 జిల్లాల్లో పాదయాత్ర చేసి అధికారం చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ సైతం పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర చేసి కేంద్ర మంత్రి అయ్యారు. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేసిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. పది జిల్లాల్లో పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. పాదయాత్రతో పవర్‌ లోకి రావొచ్చన్న సెంటిమెంట్ కేటీఆర్కు కలిసి వస్తుందా? అనేది కాలమే సమాధానం చెప్తుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతపైనే బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఆధారపడుతున్నారు. ఆ యాంటీ ఇన్‌కంబెన్సీ బీజేపీ ఖాతాలోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. బీఆర్ఎస్, కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను ‘టీఆర్ఎస్’ బ్రాండ్‌తో చేజిక్కించుకోవాలన్నది కవిత వ్యూహం. అన్నా చెల్లెళ్లిద్దరూ గ్రౌండ్‌లో ఉంటే మీడియా అటెన్షన్, పబ్లిక్ డిబేట్ బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్‌ తరహాగా మారుతుందనే వాదన కూడా తెరపైకి వస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>