కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికి వదిలేసి, బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులపై పడి ఏడవడం రేవంత్ రెడ్డి “తుగ్లక్” పాలనకు నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్‌లో పట్టపగలు జ్యువెలరీ షాపుపై దాడి జరిగి నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం బీఆర్ఎస్ నాయకులను వేధించడమే పనిగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, 13 డిక్లరేషన్లు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.
Read Also: ఓట్ల లెక్కింపు.. ఆర్జీకర్ మృతురాలి తల్లి ముందంజ
Follow Us On: Sharechat

