తమిళనాడు ఫలితాలపై ప్రశాంత్​ కిషోర్​ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న టీవీకే (TVK) ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా అంచనాల ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 128 నుండి 135 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విజయ్​ టీవీకే పార్టీ 100 కు పైగా సీట్లలో ముందంజలో ఉండటంతో ప్రశాంత్ కిషోర్ సంస్థలో సంబరాలు మొదలయ్యాయి. టీవీకే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఎవరి మద్దతు అవసరం లేదని పీకే స్పష్టం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవడంపై ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయ్ స్వయంగా కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపి 60 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని, తాను వ్యక్తిగతంగా ప్రియాంక గాంధీని కలిసి వివరించినట్లు పేర్కొన్నారు. అయితే దక్షిణ రాష్ట్రాల కాంగ్రెస్ నేతల ఒత్తిడి కారణంగానే ఈ పొత్తు సాధ్యం కాలేదని, ఇది కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) వ్యాఖ్యానించారు. 60 నుండి 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుకు సహకరిస్తామన్నా వారు నమ్మలేదని ఆయన గుర్తు చేశారు.

Read Also: బెంగాల్ ఫలితాలు.. ఈసీ కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>