Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు.. కేటీఆర్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్ముతుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును అంతటి దారుణమైన విభజనతో పోల్చుతుంటే.. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. వారంతా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని మండిపడ్డారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సాగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని, అమరుల త్యాగాలను తేజస్వి అవమానించారని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదని, తెలంగాణ ఆస్తిత్వాన్ని కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ పట్ల బీజేపీకి నరనరనా వ్యతిరేకత నిండి ఉందని ఆరోపించారు. ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అంటూ గతంలో ప్రధాని మోదీ (PM Modi) కూడా తెలంగాణను అవమానించారని తెలిపారు. అదే బాటలో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీలు ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం అన్నారు. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు, ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ సూర్య (Tejasvi Surya) బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే పోరాటమని, దానిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Read Also: డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. విపక్షాలకు కౌంటర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>