ఆపద్బాంధవుడు సాంగ్ రీ-క్రియేషన్.. 62 ఏళ్ల మీనాక్షి శేషాద్రి అద్భుతమైన డ్యాన్స్

కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనగానే ‘ఆపద్బాంధవుడు’ లాంటి క్లాసికల్ మూవీ కచ్చితంగా కళ్లముందు నిలుస్తుంది. ముఖ్యంగా అందులోని పాటలు, చిరు నటన సినిమాకు హైలైట్. ఇక ‘ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా‘ అనే పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. అలాంటి పాటను 34 ఏళ్ల తర్వాత నటి మీనాక్షి శేషాద్రి (Meenakshi Seshadri) మళ్ళీ ఆవిష్కరించారు. 62 ఏళ్ల వయసులోనూ ఆమె ప్రదర్శించిన ఆ గ్రేస్, అభినయం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మూడు దశాబ్దాల క్రితం ఏ కవళికలతో అయితే తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారో, ఇప్పుడు అదే ఎనర్జీతో, అదే లుక్స్ తో ఆ క్లాసికల్ డ్యాన్స్‌ను రీ-క్రియేట్ చేసింది. తనలోని అసలైన కళాకారిణిని మరోసారి బయటపెట్టింది. కాలం మారినా ఆమెలోని (Meenakshi Seshadri) నాట్య ప్రతిభ కొంచెం కూడా తగ్గలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తోంది.

Read Also: ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ కౌంటర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>