కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో డీలిమిటేషన్ (Delimitation) బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) విపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, పైగా ఆ రాష్ట్రాలకు లాభమే చేకూరుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ బిల్లుపై విపక్షాలు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ ప్రక్రియ ద్వారా మరింత బాగుపడుతాయన్నారు.
సీట్ల సంఖ్య పెరగడం వల్ల ఆ రాష్ట్రాల ప్రాతినిధ్యం కూడా పెరుగుతుందని వివరించారు. ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉన్నా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని, సభ నుంచి వాకౌట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. దక్షిణ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఒక్క సీటు కూడా తగ్గబోదని అమిత్ షా (Amit Shah) అన్నారు.
Read Also: ఝాన్సీ రెడ్డిపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ నేతల పిటిషన్!
Follow Us On : WhatsApp

