కలం డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). తెలంగాణ భవన్ లో కొత్తగా గెలిచిన సర్పంచులకు సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడ అభివృద్ధి అనేది ఉండదు. ఇంకో రెండేళ్లు తెలంగాణకు ఈ కష్టాలు తప్పవు. రైతులు యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు వచ్చాయి. యూరియా యాప్ అనేది కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది’ అంటూ చెప్పారు కేటీఆర్ .
పదేళ్ల బీఆర్ ఎస్ టైమ్ లో రైతులు ఎన్నడూ క్యూ లైన్లలో చెప్పులు పెట్టే పరిస్థితి రాలేదని చెప్పారు. టైమ్ కు యూరియా బస్తాలు అందించామని.. కానీ రేవంత్(Revanth Reddy) ప్రభుత్వం యూరియా కోసం రైతులను నానా ఇబ్బందులు పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ‘అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు రైతులు. నిజంగా రేవంత్ చెబుతున్నట్టు కాంగ్రెస్ కు 66 శాతం సర్పంచ్ స్థానాలు వస్తే వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి’ అంటూ డిమాండ్ KTR చేశారు.
Read Also: ప్రపంచస్థాయి పోటీలే లక్ష్యం.. మంత్రి తుమ్మల
Follow Us On: Instagram


