కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాంపల్లి లోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల సందర్భంగా ముఖ్యమంత్రి శనివారం నాంపల్లి(Nampally)లోని మనోరంజన్ కోర్టుకు వెళ్లారు. ఈ మూడు కేసులకు సంబంధించి విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహణపై 2016లో రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో పాటు వివిధ కారణాలతో తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదయిన కేసులను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనపై అక్రమంగా కేసులు పెట్టారని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల నడుస్తున్న విచారణకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యక్తిగతంగా వెళ్లారు.
Read Also: ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : కేటీఆర్
Follow Us On: Sharechat


