సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దోచుకోవడం తప్ప హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. తాజగా ఈ ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేంటో చెప్పేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తమ పాలనలో ఏమేం చేశారో వివరించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యక్షంగా సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. “టైమ్, ప్లేస్ చెప్పండి, జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీభవన్.. ఎక్కడకు రమ్మన్నా చర్చకు వస్తాం” అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
రేవంత్ రెడ్డి అభివృద్ధిపై కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణం, చెత్త సేకరణ, విద్యుత్, మంచినీటి, గ్రీన్ సిటీ అభివృద్ధి, ఆసుపత్రులు, పాఠశాలలు, పింఛన్లు వంటి ప్రజాసేవలపై ప్రత్యేకంగా నోటీసు తీసుకున్నట్టు తెలిపారు.
కేటీఆర్ చెప్పిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం 5,328 కోట్లు, మెట్రో ప్రాజెక్ట్‌కు 1,722 కోట్లు ఖర్చు చేసింది. అలాగే నివాస గృహాల వద్ద తాగునీటి, విద్యుత్, పార్కుల నిర్వహణ, ఫ్లై ఓవర్‌లు, డబుల్ బెడ్‌రూం ప్రాజెక్టులు, గురుకులాలు, పేదలకు వైద్య సేవలు వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
“రెండేళ్ల రేవంత్ పాలనలో అభివృద్ధి ఏదైనా ఉందా? జూబ్లీహిల్స్‌లో ప్రతి ఇంటికీ పంపిన ప్రగతి నివేదికలతో పోల్చి చూపించాలి” అని కేటీఆర్(KTR) ఆగ్రహించారు.
Read Also: దేశాధ్యక్షురాలితో అసభ్య ప్రవర్తన..
Follow Us on: Youtube

