ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపుదాడులు(ACB Raids) చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం, పలనాడు జిల్లా నరసరావుపేట, రేణిగుంట, విజయనగరం, విశాఖ, ఒంగోలు, కర్నూలు, కడప వంటి ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఈ దాడులు కొనసాగాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తూ, కొందరు ఏజెంట్లు సిబ్బందితో కలసి అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. అధికారులు కార్యాలయాల తలుపులు మూసి లోపల రికార్డులను సవివరంగా పరిశీలిస్తున్నారు. రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సిబ్బంది, దస్తావేజుల విభాగంలో లావాదేవీలపై సమగ్ర పరిశీలనలు చేస్తున్నారు. అధికారులు పలు కీలక రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ఆనంద రెడ్డిపై అవినీతి కేసుల ఆరోపణలు ఉన్నాయని సమాచారం.
ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు(ACB Raids) నిర్వహించారు. దీంతో దానివల్ల డాక్యుమెంట్ రైటర్లు అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. అధికారులు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు అక్కడ ఎటువంటి అవినీతి ఆధారాలు దొరకలేదని అధికారులు తెలిపారు. తనిఖీలు పూర్తి అయ్యే వరకు అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తారు.రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎంత అవినీతి సొమ్మును సీజ్ చేశారు. ఏసీబీ దాడులకు సంబంధించి కీలక సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
Read Also: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. ప్లేస్, టైమ్ చెప్పాలంటూ
Follow Us on: Instagram

