కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష విధానాలతో ప్రాంతీయ అసమానతలను పెంచుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR )విమర్శించారు. కేంద్ర బడ్జెట్(Union Budget)పై ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో “ఎంచుకున్న ఫెడరలిజం” బయటపడిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత కేటాయిస్తూ, దేశంలో ఆర్థికంగా శక్తివంతమైన తెలంగాణపై ప్రత్యేక ప్రస్తావన లేకుండా విస్మరించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర విధానం సహకార ఫెడరలిజంను బలహీన పరుస్తుందని, అలాగే ప్రాంతీయ అసమానతలను మరింత పెంచుతుందని తెలిపారు. బడ్జెట్‌లో తెలంగాణకు సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారే అవకాశముందని హెచ్చరించారు.
Read Also: యూఎస్ఏతో గేమ్.. ‘ఒత్తిడి ఎంతుందో నాకే తెలుసు’
Follow Us On: Sharechat


