epaper
Wednesday, February 18, 2026
epaper

యూఎస్ఏతో గేమ్.. ‘ఒత్తిడి ఎంతుందో నాకే తెలుసు’

కలం, వెబ్​ డెస్క్​ : టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో యూఎస్ఏను చిత్తు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమయ్యిందనే చెప్పాలి. ఓపెనర్లలో అభిషేక్ శర్మ డకౌట్ కావడం.. ఆ తర్వాత తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కూడా 30లోపు స్కోర్‌కే పెవిలియన్ చేరారు. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌పై ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు కూడా ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్ చేరుతుండటంతో సూర్యకుమార్‌పై ఒత్తిడి అంతకంతా పెరిగింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ (Suryakumar) స్పందించాడు.

77 పరుగులకే ఆరు వికెట్లు పడిన సమయంలో తనపై తీవ్ర ఒత్తిడి ఉందని, అయినా చివరి వరకు నిలబడి ఆడగలననే నమ్మకం తనకు ఉందని తెలిపాడు. వాంఖడే వేదికగా USAపై భారత్ గెలిచిన మ్యాచ్‌లో సూర్యకుమార్ చేసిన 84 పరుగులు కీలకంగా నిలిచాయి. పిచ్ అనూహ్యంగా ఉండటంతో టాప్ ఆర్డర్ త్వరగా కూలిపోయింది. ఒక దశలో భారత్ 77/6కు చేరింది. ఈ పరిస్థితుల్లో సూర్యకుమార్ (Suryakumar) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

ముంబై మైదానాల్లో తన అనుభవం ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. చివరి వరకు ఆడితే జట్టుకు లాభం ఉంటుందనే భావనతో ఆడినట్లు చెప్పారు. ఫలితంగా భారత్ 161/9 స్కోరు చేసింది. లక్ష్య చేధనలో యూఎస్ఏను భారత బౌలర్లు కట్టడి చేశారు. యూఎస్ఏ 132 పరుగులకే పరిమితమవడంతో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది.

Read Also: బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>