కోట్లాది రూపాయల పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో (Ameenpur) కోట్లాది రూపాయల‌ విలువైన పార్క్‌కు సంబంధించిన మూడెకరాల స్థలాన్ని హైడ్రా (HYDRAA) అధికారులు కాపాడారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీలో కబ్జా కోరల్లో చిక్కుకున్న పార్కు స్థలానికి ఆదివారం ఉద‌యం హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. పార్క్ స్థ‌లాన్ని కాపాడాల‌ని స్థానిక కాలనీవాసులు హైడ్రా క‌మిష‌నర్ రంగ‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విష‌యంపై దృష్టి సారించిన‌ రంగనాథ్ చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉద‌యం చ‌క్ర‌పురి కాల‌నీకి చేరుకున్న అధికారులు 1300 గజాల పార్క్ స్థలానికి ఫె‌న్సింగ్ వేశారు. త‌మ ఫిర్యాదుపై స్పందించి చ‌ర్య‌లు తీసుకున్నందుకు అధికారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

Read Also: ముస్లిం రిజర్వేషన్లపై రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>