తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మలేషియా చేరుకున్న కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుక్రవారం మలేషియా చేరుకున్నారు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ లో ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీన కౌలాలంపూర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కేటీఆర్ మలేషియాకు వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ మలేషియా (Malaysia) చేరుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న కేటీఆర్ దంపతులకు ప్రవాస తెలంగాణ ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>