కలం, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్ ఆసుపత్రి (TIMS Hospital) ని అభివృద్ధి చేసినట్లు కేటీఆర్ (KTR) తెలిపారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ (Sanath Nagar) టిమ్స్ ఆసుపత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా ఈ అద్భుతమైన హాస్పిటల్‌కు శ్రీకారం చుట్టినందుకు కేసీఆర్‌కు హైదరాబాద్ ప్రజలు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు.
ఈ టిమ్స్ ఆసుపత్రిలో వైద్య వ్యవస్థ 3 బ్లాకులుగా ఉందని తెలిపారు. మొత్తం 1000 పడకల ఆసుపత్రి అని, దీనిలో 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ విజన్ చాలా గొప్పదని, బసవతారకం ఆసుపత్రి బయట రోడ్డు మీద రోగుల అటెండర్స్ పడుకోవడం చూసి టిమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలోనే అలాంటి వారి కోసం 200 పడకలతో ధర్మశాలను కట్టించారని ప్రశంసించారు. రూ.1200 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో టిమ్స్ ఆసుపత్రి నిర్మించినట్లు కేటీఆర్ (KTR) తెలిపారు. కేవలం ఆసుపత్రే కాకుండా.. పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read Also: లడ్డూ ప్రసాదం నాణ్యత పెంపుకు టీటీడీ కీలక నిర్ణయం
Follow Us On : WhatsApp

