బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : చిరుమర్తి లింగయ్య

కలం, నకిరేకల్ : మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో కేసు నమోదైన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) డిమాండ్ చేశారు. శుక్రవారం నకిరేకల్ లో బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, పోక్సో వంటి తీవ్రమైన కేసు నమోదై వారం రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతుండటం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ‘బి-టీమ్’గా పనిచేస్తోందని స్పష్టమవుతోందని ఆయన విమర్శించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అండదండలతోనే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. “రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. మహిళల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ‘బేటీ బచావో – బేటీ పడావో’ అని నినాదాలు చేసే బీజేపీ నాయకులు, తమ సొంత పార్టీ నాయకుల పిల్లలు ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలి” అని చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) డిమాండ్ చేశారు.

Read Also: జిల్లాల బాటలో సీఎం.. ఆసక్తికరంగా BRSపై కౌంటర్ స్ట్రాటజీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>