కలం, వెబ్ డెస్క్ : రాబోయే ఎన్నికల్లో కేవలం సర్వేల ఆధారంగానే అర్హులైన వారికి టికెట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ అంబర్ పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్ ప్రక్రియపై స్పందించారు. నకిలీ ఓటర్ల జాబితాను అందిస్తానని ఎక్కడ ఏముందో అందరూ చూసుకోవచ్చు అని కార్యకర్తలకు సూచించారు.
అంబర్‌పేటలో గెలిచే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ పార్టీ వాళ్లు కొన్ని ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని.. కొత్త కథలు అల్లే ఆలోచనలో ఉన్నారని కేటీఆర్ (KTR) ఆరోపించారు. బీజేపీ వ్యూహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని గులాబీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాపై జూలై 24 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆభ్యంతరాలు తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదలవుతుందని చెప్పారు. ఈ జాబితానే రాబోయే కార్పొరేషన్, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు.
అలాగే, పార్టీలో ఎవరికీ కూడా టికెట్ల కేటాయింపుపై ఎలాంటి ముందస్తు వాగ్దానాలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కష్టపడిన వారికి, ప్రజా సమస్యలపై ఎక్కువగా పోరాటం చేసిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం గట్టిగా నిలబడే వారికే ప్రాధాన్యత లిభిస్తుందన్నారు. ఎమ్మెల్యేలు, పెద్ద నాయకుల చుట్టూ తిరిగే వారికి కాకుండా… నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి చుట్టూ తిరిగే నాయకులకే గుర్తింపు లభిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Also: బరువు తగ్గాలా? ఇలా స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి!
Follow Us On: Instagram

