ఫ్యూచ‌ర్ సిటీ చుట్టూ సీఎం సోద‌రుల భూ దోపిడీ: కేటీఆర్

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న ఫ్యూచ‌ర్ సిటీ (Future City) చుట్టూ ఆయ‌న సోద‌రులు భూ దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. అస‌లు ఫ్యూచ‌ర్ లేని సీఎం ఫ్యూచ‌ర్ సిటీ ఎలా నిర్మిస్తార‌ని ఎద్దేవా చేశారు. నేడు జ‌రిగిన‌ ఇబ్ర‌హీం ప‌ట్నం మున్సిప‌ల్ చైర్మ‌న్ స‌న్మాన స‌భ‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏఐ గ్రాఫిక్స్‌తో రేవంత్ రెడ్డి ఫ్యూచ‌ర్ సిటీ అని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని కేటీఆర్ అన్నారు. ఫార్మా సిటీ కోసం భూములు సేక‌రిస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక ఆ భూములు ర‌ద్దు చేశాడ‌ని మండిప‌డ్డారు.

రేవంత్ రెడ్డి (Revanth Reddy) అరాచ‌క పాల‌న‌ను అంతం చేయ‌డానికి కొత్త త‌రం ముందుకు రావాల‌ని కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు. ఇంత‌టి దుర్మార్గ‌పు పాల‌న‌ను తానెప్పుడూ చూడ‌లేద‌న్నారు. చంద్ర‌బాబు, వైఎస్ఆర్, రోష‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి వంటి ఎంతో మంది పాల‌న చూశామ‌ని, కానీ ఇలాంటి అరాచ‌క పాల‌న‌ను ఎప్పుడూ చూడ‌లేద‌ని పేర్కొన్నారు. పేద‌ల భూములు లాక్కునే రేవంత్ రెడ్డి ఒక చ‌రిత్ర హీనుడిగానే గుర్తుండి పోతార‌న్నారు. తెలంగాణ స‌మాజం సీఎం రేవంత్‌కు, కాంగ్రెస్ పార్టీకి స‌రైన గుణ‌పాఠం చెప్తార‌ని వ్యాఖ్యానించారు. మ‌రో 50 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో కేసీఆర్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మున్సిప‌ల్‌ ఎన్నిక‌ల విష‌యంలో ఇబ్ర‌హీంప‌ట్నం, క్యాత‌న్‌ప‌ల్లి, ఖానాపూర్‌లో రెండు నెల‌ల పాటు తిప్పుతూ ఇబ్బందుల‌కు గురి చేశార‌న్నారు. ఆఖ‌రికి కోర్టులు అంటే కూడా ఈ ప్ర‌భుత్వానికి, పాల‌కుల‌కు భ‌యం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read Also: సర్కార్ వర్సెస్ ఆర్టిజన్స్.. సర్వీస్ రూల్స్ కోసం సమరం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>