సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణం: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ (Civil Supplies Corporation)లో రేవంత్ సర్కార్ చేసిన కుంభకోణం వల్ల ధాన్యం కొనుగోలు జరగడం లేదని ఆరోపించారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంట కొనుగోలు చేయాల్సి ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాం వలన మార్క్‌ఫెడ్ పేరుతో తీసుకువచ్చిన సుమారు రూ.23 వేల కోట్ల అప్పును ఇతర అవసరాలకు తరలించిందని అన్నారు. దీంతో మార్క్‌ఫెడ్ వద్ద నిధులు లేవని.. అందుకే కొత్తగా డబ్బులు కూడా రావడం లేదని చెప్పారు. ఈ కారణంగా రాష్ట్రంలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు నిలిచిపోయాయని వివరించారు. తమ సివిల్ సప్లైస్ స్కాంను కప్పిపుచ్చుకోవడానికి పంటల కొనుగోళ్లు చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు.

జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామంలోని ఐకేపీ పంట కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా పంట కొనుగోళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మార్క్‌ఫెడ్ అధికారులకు కలెక్టర్ దగ్గరికి వెళ్లి పంట కొనాలని విన్నవించినా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో స్పందించిన కేటీఆర్.. మార్క్‌ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి పంట కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, మార్క్‌ఫెడ్ వైఫల్యాన్ని నిలదీశారు. పంట కొనేది ఉన్నదా లేదా అనేది రైతులకు చెప్పాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>