ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలి: బీసీ వెల్ఫేర్

కలం, కరీంనగర్ బ్యూరో: బీసీ సంక్షేమ, అనుబంధ సంఘాల నాయకులు (BC Welfare Leaders) దొగ్గలి శ్రీధర్, నారోజు రాకేష్ చారి, క్రాంతితో కలిసి ఉన్నత విద్యాధికారిణి ఏడి మాధవిని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలో నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు ఫీజులు నియంత్రించే బోర్డులు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అన్ని ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రించే బోర్డులు ఏర్పాటు చేస్తే.. విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ల ఫీజు, సంవత్సర టర్మ్ ఫీజు చెల్లించే విధాన ప్రక్రియ సులభంగా ఉంటుందని తెలిపారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అధికారి పార్టీకి చెందిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ గురించి ప్రస్తావించి దానిని అరికట్టే విధంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారని ఉన్నత విద్యాధికారినికి వారు తెలిపారు. దీనిపై మాధవి సానుకూలంగా స్పందిస్తూ ఫీజులు నియంత్రించే బోర్డులను ఏర్పాటు చేస్తామని.. ప్రభుత్వానికి లేఖ పంపిస్తామని తెలిపారు. అధికారి పార్టీకి చెందిన సుడా చైర్మన్ కూడా ప్రభుత్వంతో మాట్లాడి అన్ని ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రించే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

Read Also: వండర్ బామ్మ : 80 ఏళ్ల వయసులో చెట్టు ఎక్కగలదు.. చిటారునున్న చింత చిగురు కోయగలదు

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>