వర్షాకాలంలో నీరు తక్కువగా తాగుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

కలం, వెబ్ డెస్క్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. మన శరీరం రోగాల బారిన పడకుండా సక్రమంగా పనిచేయాలంటే నీరు చాలా ముఖ్యమైన ఇంధనంగా పనిచేస్తుంది. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ కొంత మంది దాహం వేస్తే గానీ నీరు తాగరు. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా మంది నీరు చాలా తక్కువగా తాగుతారు. కానీ కాలం ఏదైనా శరీరానికి తగినంత నీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వర్షాకాలంలో నీరు ఎక్కువగా తాగేందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు (Rainy Season Health Tips) చెప్పారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి నీరు తాగడం: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో చల్లని నీరు తాగడం ఇష్టం లేక చాలామంది నీటిని తాగడం తగ్గిస్తుంటారు. అటువంటి వారు వెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

తులసి లేదా నిమ్మకాయ నీరు: మనం తాగే నీటిలో తులసి ఆకులు లేదా నిమ్మరసం, నిమ్మకాయ ముక్కలు వేయడం వలన మంచి రుచి వస్తుంది. సాధారణ నీటితో పోలిస్తే ఇలా రుచిని జోడించినప్పుడు మనం ఎక్కువ నీరు తాగుతామని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, నిమ్మకాయలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి వర్షాకాలపు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయట.

హెర్బల్ టీలు: తులసి, అల్లం, పుదీనాతో తయారు చేసిన హెర్బల్ టీలు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. అంతే కాకుండా ఇవి శరీరానికి మేలు చేసే అద్భుతమైన ఔషద పానీయాలుగా చెప్పుకోవచ్చు.

వాటర్ అలారం: ఎండా కాలంతో పోలిస్తే వర్షాకాలంలో దాహం వేయదు. అలాంటప్పుడు నీరు తాగడానికి అలారం పెట్టుకోవడం ఉత్తమమైన పద్ధతి. ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి తాగేలా అలారం పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

జ్యూసీ పండ్లు: శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా ఉండేందుకు జ్యూసీ పండ్లు తినడం బెస్ట్. పియర్స్, దానిమ్మ, బొప్పాయి పండ్లను రోజూ తినడం వలన శరీరానికి అవసరమైన నీటి శాతం అందుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పండ్లు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.

వాటర్ బాటిల్: మనం ఇంట్లో ఉన్నా లేదా ఆఫీసులో ఉన్న వాటర్ బాటిల్ మన పక్కనే పెట్టుకోవడం వలన తెలీకుండానే ఎక్కువ నీరు తాగుతామని చెబుతున్నారు. అందుకే మీ బెడ్, లేదా ఆఫీస్ డెస్క్ దగ్గర వాటర్ బాటిల్ ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

నిద్రలేచిన వెంటనే: ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగాలని చెబుతున్నారు నిపుణులు. రాత్రంతా నిద్ర పోతున్నప్పుడు మనం శరీరం 7 నుంచి 8 గంటల పాటు నీరు అందక డీహైడ్రేషన్ కు గురవుతుంది. అందుకే ఉదయం లేవగానే మనం తాగే గ్లాసు నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

కొబ్బరి నీరు: కొబ్బరి నీరులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కొబ్బరి నీరు తాగొచ్చు. వర్షాకాలంలో వాటర్ ఎక్కువగా తాగలేని వారు ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read : మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం బాదం నూనె చిట్కాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>