Mobile Popup Ad
Mobile Popup Ad

కేటీఆర్ ప్రశ్నలకు మంత్రి సీతక్క కౌంటర్

కలం, వెబ్ డెస్క్: రెండో రోజు అసెంబ్లీలో వాడివేడిగా చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో కోటిమంది మహిళలకు ఎలా కోటీశ్వరులను చేస్తారు? అంటూ అసెంబ్లీలో ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యలకు మంత్రి సీతక్క (Seethakka) సీరియస్ కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు ఈ రెండు సంవత్సరాల్లో రూ.57 వేల కోట్ల రుణాలు ఇప్పించామని చెప్పారు.

మహిళా రుణాలకు సంబంధించి రూ.1,390 కోట్లు ఇప్పటివరకు మహిళలకు వడ్డీలు చెల్లించామన్నారు. ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసంతో బతికే మహిళలకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో దృష్ప్రచారం చేయడమే బీఆర్ఎస్ పార్టీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ (BRS) ఏం చేసింది? అంటూ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రూ. 3,000 కోట్ల వడ్డీలను మహిళలపై భారం మోపిందని ఆరోపించారు. మహిళలకు ఇవ్వాల్సిన రూ.3,000 కోట్ల వడ్డీలను చెల్లించకుండా మోసం చేసిందని మండిపడ్డారు.

ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసి ఆదా చేసుకున్న అభ్యాస నిధులను గత ప్రభుత్వం కాజేసిందని సీతక్క (Seethakka) ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు బీఆర్ఎస్ నెరవేర్చలేదని ప్రశ్నించారు. మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాల్లో చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి కట్టించలేదని దుయ్యబట్టారు. మహిళలకు వడ్డీ లేని రుణాల పైన నిష్ఠూరాలు ఎందుకు? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంపై మాట్లాడే ముందు మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు దానికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Read Also: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో కేటీఆర్ ఘాటు ప్రశ్నలు

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>