నిండుకుండలా మారిన పోచారం ప్రాజెక్ట్.. మంజీరాలోకి భారీగా నీటి విడుదల

కలం, మెదక్ బ్యూరో: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ప్రాజెక్ట్ నిండుకుండలా మారి అలుగు మీదుగా నీరు పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమై, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువ మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి వివరాలు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం- 1.8 TMC లు కాగా.. ప్రస్తుత నీటి సామర్ధ్యం- 1.8 TMC లు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం / FRL 1464.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1464.00 అడుగులు. ఇన్ ఫ్లో 6,690 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 6,690 క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు.

దిగువకు నీటి విడుదల

6,690 క్యూసెక్కుల మిగులు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) పరివాహక ప్రాంతం, దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించారు.

Also Read : తుంగ‌తుర్తి పంచాయితీపై జ‌గ్గారెడ్డి నివేదిక‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>