కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని పార్సిగుట్టలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏ1 ఫ్రెష్ చికెన్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా నిల్వ ఉంచిన పాడైపోయిన కోడి మాంసాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 800 కిలోల కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఈ షాపు నుండి పెద్ద ఎత్తున వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు మాంసం సరఫరా అవుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా ఈ చికెన్ సెంటర్ గత జనవరి నుండే గడువు ముగిసిన లైసెన్స్‌తో కొనసాగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, షాపు యజమాని షకీల్‌తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Read Also: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Follow Us On: X(Twitter)

