Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో ఫ్లాట్స్ సేల్స్ పై లేటెస్ట్ రిపోర్ట్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం(Real Estate Sector) మందగించిందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ (Knight Frank Report) విడుదల చేసిన తాజా రిపోర్ట్ హైదరాబాద్ మార్కెట్‌కు ఊరటనిచ్చింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో గృహ విక్రయాలు సంతృప్తికరంగా పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది.

2026 జనవరి నుంచి మార్చి వరకు తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో మొత్తం 9,541 రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది సుమారు 1 శాతం వృద్ధి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంలో మరింత వేగవంతమైన పురోగతి కనిపించింది. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 48 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా ఈ కాలంలో మొత్తం 3 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ లావాదేవీలు జరిగితే, అందులో హైదరాబాద్ వాటా దాదాపు 60 లక్షల చదరపు అడుగులు.

పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లు, ఐటీ కంపెనీలు కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరిగినట్లు రిపోర్ట్ (Knight Frank Report) పేర్కొంది. మొత్తం ఏడాది కాలాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ మార్కెట్ 5 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇక గృహ విభాగంలో కోటి రూపాయలకు పైబడిన ఫ్లాట్ల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ తెలిపింది.

అయితే కోటి రూపాయల లోపు ఉన్న ఇళ్ల సేల్స్ మాత్రం పెద్దగా పెరగలేదని పేర్కొంది. ముంబై, ఢిల్లీ, పూణె వంటి నగరాల్లో గృహ విక్రయాలు తగ్గుముఖం పట్టగా, హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాల్లో మాత్రం వృద్ధి కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే దాదాపు మూడు వేల అదనపు ఫ్లాట్లు అమ్ముడయ్యాయి.  గతేడాది రెండవ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాలలో మొత్తం 81,927 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సేల్స్ కాగా అందులో దాదాపు 13 శాతం  హైదరాబాద్‌లోనే (9,589) ఉన్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 84,827 ఫ్లాట్లు అమ్ముడవగా, అందులో హైదరాబాద్ వాటా 9,541గా నమోదైంది.

Read Also: కేసీఆర్‌కి సొంత ఇలాకాలో భారీ షాక్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>