కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 ( IPL 2026) లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. అజింక్య రహానే సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (KKR vs SRH)తో తలపడనుంది. ఈ సీజన్‌లో తమ మొదటి హోమ్ మ్యాచ్ ఆడుతున్న కేకేఆర్, ఎలాగైనా తొలి విజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో భారీ స్కోర్లు చేసినప్పటికీ, బౌలర్లు విఫలం కావడంతో ఓటమిని చవిచూశాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 220 పరుగులు చేసినా కేకేఆర్ బౌలర్లు దానిని కాపాడుకోలేకపోయారు. అటు సన్‌రైజర్స్ కూడా బెంగళూరుపై 201 పరుగులు చేసి డిఫెండ్ చేయడంలో విఫలమైంది. మతీషా పతిరానా ఇంకా జట్టుతో చేరకపోవడం, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా వంటి కీలక బౌలర్లు మొదటి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోవడం కేకేఆర్‌ను ఆందోళన పరుస్తోంది.
అదే సమయంలో హైదరాబాద్ బౌలర్లు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ (KKR vs SRH) మ్యాచ్‌లో ముగ్గురు బౌలర్లు విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఓ సారి లుక్కేద్దాం..
వరుణ్ చక్రవర్తి: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్, ఈడెన్ గార్డెన్స్‌లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఇక్కడ ఆడిన 22 మ్యాచ్‌ల్లో అతను 30 వికెట్లు తీశాడు. మొదటి మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోయినప్పటికీ, హైదరాబాద్‌పై గతంలో 14 వికెట్లు తీసిన అనుభవం అతనికి ఉంది.
జయదేవ్ ఉనద్కత్: పవర్‌ప్లేలో వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న ఉనద్కత్, ఐపీఎల్‌లో 100కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడు. కోల్‌కతా పిచ్‌పై 11 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసిన రికార్డు అతనికుంది. గత మ్యాచ్‌లో ఒక వికెట్ తీసినా, నేడు మరింత మెరుగ్గా రాణించాలని భావిస్తున్నాడు.
వైభవ్ అరోరా: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు సమర్పించుకున్న వైభవ్, నేటి మ్యాచ్‌లో పుంజుకోవాలని చూస్తున్నాడు. కోల్‌కతాలో 13 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన రికార్డు అతనికి సానుకూలాంశం. గత సీజన్‌లో హైదరాబాద్‌పై మూడు వికెట్లతో మెరిసిన వైభవ్, మరోసారి అవే ఫలితాలను రిపీట్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు.
Read Also: రికార్డు ధర పలికిన రవివర్మ పెయింటింగ్.. ఎన్ని కోట్లంటే..?
Follow Us On: Facebook

