సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. తెలంగాణలో బెస్ట్ ప్లేసెస్ ఇవే!

కలం, వెబ్ డెస్క్: త్వరలో సమ్మర్ (Summer) సెలవులు మొదలుకానున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే తెలంగాణలో హైదరాబాద్‌కు దగ్గరగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటే చాలా మంచిది. లోబడ్జెట్‌లో టూర్ ప్లాన్ చేయాలనుకుంటే కొన్ని టాప్ బెస్ట్ ప్లేసెస్‌లున్నాయి (Top Cool Places). భానుడి భగభగలకు చల్ల చల్లగా ఎంజాయ్ చేయొచ్చు. కర్ణాటక సరిహద్దుల్లోని గొట్టం గుట్ట అనే మంచి టూరిజం ప్లేస్ ఉంది. ఇది చంద్రంపల్లి ఆనకట్ట బ్యాక్ వాటర్స్ పక్కనే ఉన్న ఈ ఎత్తైన ప్రదేశంలో వీచే చల్లని గాలులు పర్యాటకులకు ఎంతో హాయినిస్తాయి. అలాగే నిజామాబాద్ జిల్లాలోని పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరో ప్రధాన ఆకర్షణ. ఇక్కడి దట్టమైన అడవి, బంగ్లా సమీపంలోని చల్లని వాతావరణం మధ్యాహ్న సమయంలోనూ పిక్నిక్‌లకు అనువుగా ఉంటాయి.

చారిత్రక నేపథ్యం ఇష్టపడే వారి కోసం నల్గొండ జిల్లాలోని రాచకొండ (Rachakonda) కోట ఉత్తమ ఎంపిక. 14వ శతాబ్దపు ఈ కోట నిర్మాణ శైలి ఏప్రిల్ ఎండల్లో కూడా ఇక్కడ సహజ సిద్ధమైన వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక నీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ఆనకట్టకు వెళ్లొచ్చు. తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. మంజీరా నది తీరాన పక్షుల కిలకిలరావాల మధ్య ప్రశాంతంగా గడపడానికి ఇది సరైన ప్రదేశం.

చివరగా నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లెల తీర్థం జలపాతం వేసవికి అత్యంత అనువైన గమ్యస్థానం. అడవి లోపల లోయలో ఉండటం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలదు. దీనివల్ల ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా, పొగమంచుతో నిండినట్లు ఉంటుంది. హైదరాబాద్‌కు దగ్గరలో ఒక్క రోజులోనే ఈ ప్రాంతాలన్నింటినీ చూసి రావొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>