తెలంగాణలో పెట్టుబడులను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన కెనడా(Canada) ప్రతినిధులతో సమావేశమయ్యారు. కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఐటీ, ఫార్మా, ఏరో స్పేస్, పట్టణప్రాంతాల్లో మౌలిక వసతులు వంటి అనేక అంశాలపై కెనడాతో భాగస్వామ్యం కుదుర్చుకొనేందుకు సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, ముఖ్యంగా హైదరాబాద్ మల్టీ మోడల్ కనెక్టివిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కెనడా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఐటీ హబ్‌గా హైదరాబాద్ విశేషాలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, స్టార్టప్ ఎకోసిస్టంలో భాగస్వామ్యమవ్వాలని కెనడా కంపెనీలను సీఎం ఆహ్వానించారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, రీసెర్చ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపనలో పెట్టుబడులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ నాయకత్వంలోని బృందం కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని కలిసింది. హైదరాబాద్‌లో ఇప్పటికే అమలవుతున్న ఫ్రాన్స్(France) భాగస్వామ్య ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు. హైటెక్ సిటీ, మెట్రో రైల్, క్లైమేట్ సస్టెయినబిలిటీ, స్మార్ట్ సిటీ అభివృద్ధిలో ఫ్రాన్స్ సహకారం కొనసాగుతోందని సీఎం పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టి, ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం ఫ్రాన్స్ ప్రతినిధులను కోరారు. నగరంలో ఉన్న సాంకేతిక, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని వివరించిన ఆయన, “తెలంగాణ పరిశ్రమలకు, ఐటీ రంగానికి అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం. ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలతో కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం” అని పేర్కొన్నారు.
Read Also: అమెరికాకు 62 వేల కోట్ల నష్టం!.. అసలు కారణాలు ఇవే..
Follow Us On : Instagram

