epaper
Tuesday, November 18, 2025
epaper

జూబ్లీలో గెలిచింది నేనే: మాగంటి సునీత

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. ఓట్ల పరంగా గెలిచినా.. నైతికంగా మాత్రం విజయం తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) వ్యాఖ్యానించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆమె ఆరోపించారు. జూబ్లీ ఉపఎన్నికలో 24,729 ఓట్ల తేడాతో సునీత పరాజయంపాలయ్యారు.

తన ఓటమిపై ఆమె తాజాగా స్పందిస్తూ.. జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో నైతిక విజయం తనదేనన్నారు. ఈ ఉపఎన్నిక అత్యంత అప్రజాస్వామికంగా జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించే విధంగా ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రజలను భయపెడుతూ ఓట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ రిగ్గింగ్‌ చేసి గెలిచిందని విమర్శించారు. పోలింగ్ సమయంలో ఎన్నికల సంఘం (ఈసీ) సరైన విధంగా నియంత్రణ నిర్వహించలేదని, నిజానికి నైతికత ఆధారంగా తానే గెలిచానని సునీత(Maganti Sunitha) పునరుద్ఘాటించారు.

ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్(Naveen Yadav) ఘన విజయం సాధించారు. ఆయన 24,658 ఓట్ల తేడాతో విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ఎన్నికల ప్రతి దశలో కూడా కాంగ్రెస్‌ అధికారం స్పష్టంగా కనిపించింది.

Read Also: ‘కాంగ్రెస్‌పై ప్రజల నమ్మకానికి జూబ్లీ అద్దం పట్టింది’

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>