Mobile Popup Ad
Mobile Popup Ad

డీలిమిటేషన్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. డీలిమిటేషన్ లో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ విధానం అని కిషన్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వితండవాదనతో హైబ్రిడ్ నమునా అంటూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఆదిలాబాద్ లో సీట్లు తగ్గించి.. హైదరాబాద్ లో పెంచుతారా?

సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న హైబ్రిడ్ నమునా ప్రపంచంలో ఎక్కడ లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి చెప్పిన విధానం అమలు చేస్తే.. ఆదిలాబాద్ కు సీట్లు తగ్గించి హైదరాబాద్ కు పెంచుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తుందని గుర్తు చేశారు. అలాంటప్పుడు 70 శాతం సీట్లు.. హైదరాబాద్ పరిసరాల్లోనే ఉండాలా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదన అంబేద్కర్ విధానానికి వ్యతిరేకమన్న కేంద్రమంత్రి.. రేవంత్ చెప్పినట్లు చేస్తే.. గుజరాత్ కు ఎక్కువ సీట్లు వస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ వాళ్లు వితండవాదాన్ని పక్కనపెట్టి బిల్లుకు సహకరించాలని కోరారు. ఇక జనగణన ప్రక్రియలో కులగణను కూడా చేపడుతున్నామని కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్

డీలిమిటేషన్ (Delimitation) వల్ల కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బంట్రోతులుగా మారుతారు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమను ఢిల్లీలో బంట్రోతులుగా ఉంటామంటున్నారని, అయితే గతంలో సీఎంలను కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసు అని చురకలు అంటించారు. తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసింది కాబట్టే ఉమ్మడి ఏపీలో టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. దక్షిణాదికి మోదీ కీలక పదవులు ఇవ్వడం లేదంటున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. 12 ఏళ్లలో దక్షిణాదికి చెందిన ఇద్దరు ఉప రాష్ట్రపతులుగా వ్యవహరించారని వెల్లడించారు. మోదీ హయాంలో అనేక కీలక శాఖలను దక్షిణాది నేతలు నిర్వహించారని వివరించారు.

Read Also: కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ భిన్నాభిప్రాయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>