Mobile Popup Ad
Mobile Popup Ad

సాహసయాత్రకు విద్యార్థులు.. ప్రారంభించిన మంత్రి లోకేశ్​

కలం, వెబ్ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఎవరెస్ట్ (Everest) బేస్ క్యాంప్‌ను అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చారిత్రాత్మక సాహస యాత్రను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఉండవల్లిలోని తన నివాసంలో ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఇలాంటి పర్వతారోహణ యాత్రను నిర్వహించడం విశేషం.

ఈ యాత్ర ఏప్రిల్ 15వ తేదీన ప్రారంభమై 30వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు కొనసాగనుంది. 15వ తేదీ మధ్యాహ్నం విద్యార్థుల బృందం నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరుకుంటుంది. అక్కడి నుండి సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకునే లక్ష్యంతో తమ పర్వతారోహణను మొదలుపెడతారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులతో వ్యక్తిగతంగా ముఖాముఖి మాట్లాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. కఠోర శ్రమ, దృఢ సంకల్పం ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా సులభంగా అధిరోహించవచ్చని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రపంచాన్ని జయించాలని పిలుపునిస్తూ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల ప్రతిభను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) భరోసా ఇచ్చారు. ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు ఆయన తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Also: పవర్ ప్లాంట్ లో పేలుడు.. 10 మంది మృతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>