కలం, వెబ్ డెస్క్ : ఆది సాయికుమార్ హీరోగా నటించిన శంబాల సినిమా (Shambala movie) ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పాల్గొన్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఇచ్చిన స్పీచ్ శంబాల టీమ్ లో మరింత కాన్ఫిడెన్స్ పెంచింది. ఆది ఫాదర్ సాయికుమార్ తో తనకున్న అనుబంధాన్ని ఈ వేదిక మీద గుర్తుచేసుకున్నారు కిరణ్ అబ్బవరం.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. శంబాల మూవీ గురించి ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా చెబుతున్నారు. ఆది అన్నకు ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలి. నాకు ఇండస్ట్రీలో తెలిసిన పెద్ద హీరో సాయికుమార్ గారే. ఆయన నా ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాలో నటించి నా కెరీర్ గ్రోత్ కు కారణమయ్యారు. ఆయన నటించకుండా ఆ సినిమా ఫలితం ఎలా ఉండేదో తెలియదు. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకు ఎంకరేజ్ చేస్తున్నారు సాయికుమార్ గారు. సక్సెస్ ఫెయిల్యూర్ కాదు క్రమశిక్షణ ముఖ్యమని ఆయన నాతో చెబుతుండేవారు. ఆ సూచనలే నా కెరీర్ లో ఉపయోగపడ్డాయి అన్నారు.
సాయి గారు ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందుకే ఆయన పిలిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈవెంట్ కు వస్తారు. ఆది అన్న ప్రేమకావాలి సినిమా టైమ్ లో నేను బీటెక్ చేస్తున్నా. ఆ సినిమా పాటలకు డ్యాన్స్ చేయని ప్రతి స్టూడెంట్ ఉండరు. దాదాపు 14 ఏళ్లుగా ఆది అన్న కంటిన్యూగా ఎఫర్ట్స్ పెడుతూ సినిమాలు చేయడం అనేది చాలా పెద్ద విషయం. హిట్లు కొట్టడం ఒకెత్తు అయితే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం మరో ఎత్తు అని ఆది అన్నని చూస్తే అర్థమైంది. Shambala movie సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.


