కలం, వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్ లో.. వృషకర్మ అనే సినిమా (Naga Chaitanya) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడం విశేషం. సమ్మర్ లో ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత చైతన్య కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచే 25 సినిమా ఎవరితో అనేది సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని.. అయితే.. చైతూ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని సోషల్ మీడియాలో అభిమానులు ఫీలవుతున్నారు. అసలు విషయం ఏంటి..?
చైతన్య (Naga Chaitanya) 25వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నట్టుగా ఇటీవల ప్రచారం జరిగింది. చైతన్య, కొరటాల శివ మధ్య కథాచర్చలు జరిగాయి కానీ.. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. చైతన్య వృషకర్మ తర్వాత డైరెక్టర్ క్లాక్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఇంతకీ డైరెక్టర్ క్లాక్ ఎవరంటారా..? బెదురులంక సినిమాతో క్లాక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ సినిమా విభిన్న కథా చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ మూవీ తర్వాత నుంచి చైతన్యతో సినిమా చేయడం కోసం కథ పై కసరత్తు చేస్తునే ఉన్నాడట. చైతన్య 25 సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉండడంతో చైతూ ఓకే చెప్పాడని తెలిసింది.
ఈ మూవీని ఏప్రిల్ లో సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చైతన్య.. ఇలా ఒక సినిమా రెండు సినిమాలు చేసిన దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు కానీ.. స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు అయితే.. నువ్వు ఇక మారవా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అభిమానుల ఆవేదనలో కూడా అర్ధం ఉంది. మరి.. చైతూ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో.. ఎప్పుడు స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తాడో..? చూడాలి.
Read Also: వారణాసి సీక్రెట్ బయటపెట్టిన ప్రియాంకా
Follow Us On: Instagram


