కలం, టాస్క్ ఫోర్స్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి చాట్ల వనజ మృతి ఘటన (Khammam Vanaja) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆమె జూన్ 13న ప్రసవానంతరం మృతి చెందగా.. అంత్యక్రియల అనంతరం, కుటుంబ సభ్యులు సాంప్రదాయం ప్రకారం చితా భస్మం సేకరిస్తుండగా, అక్కడ ఒక కత్తెర (సర్జికల్ సిజర్స్) బయటపడటం కలకలం రేపింది. దీంతో ఆమె మృతిపై బంధువులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో అక్కడి సిబ్బంది కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కాన్పు చేశారని, అందుకే తల్లీబిడ్డల ప్రాణాలు పోయాయని వనజ (Khammam Vanaja) బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈ విషాదకర సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు గాను ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని నియమించింది. ఈ ఉన్నత స్థాయి బృందం వనజ మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా విచారిస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో ఇప్పుడు మరో అంశం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితులు కేవలం గుండాల ప్రభుత్వాసుపత్రికే పరిమితమా? లేక రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వాసుపత్రుల్లోనూ వైద్యసేవల నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై ‘కలం’ ముందే ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులను ‘కలం టాస్క్ ఫోర్స్’ విజిట్ చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా వెలుగుచూసిన అంశాలను ఫొటో ఆధారాలతో సహా మే 20న ‘కలం 360 డిగ్రీస్’ ప్రత్యేక కథనంలో ప్రచురించింది.
ప్రభుత్వ ఆసుపత్రుల వాస్తవ పరిస్థితులపై సంచలన విషయాలను తెలుసుకోవాలంటే కింద ఉన్న ఈ పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ప్రత్యేక కథనాన్ని చదవండి.
Read Also : సిరిసిల్ల సీట్.. పెరుగుతున్న పొలిటికల్ హీట్!

