Mobile Popup Ad
Mobile Popup Ad

నర్సంపేటలో ఉద్రిక్తత.. గిరిజన రైతులపై దాడి?

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పల్ తండాలో సబ్ స్టేషన్ నిర్మాణ స్థల సేకరణకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి తమపై దాడికి దిగి తీవ్రంగా కొట్టారని గిరిజన రైతులు ఆరోపించారు. పలువురికి గాయాలైనట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా స్థానికంగా వైరల్ అయ్యాయి. సబ్ స్టేషన్ నిర్మాణాన్ని కొంతకాలంగా గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే పర్యటన వేళ గందరగోళం చెలరేగి, చివరికి ఘర్షణగా మారింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>