కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకులగూడెం గ్రామంలోని ముత్యాలవాగు (Muthyalavagu) పై చెక్ డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయల (రూ.1,74,00,000) నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెక్‌డ్యామ్‌కు సంబంధించిన ఎత్తు, పరిమాణం, డిజైన్ వంటి అంశాలు జిల్లా ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ చూసుకుంటారని ఆ జీఓలో పేర్కొన్నారు. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణం వలన వర్షాలు పడినప్పుడు వరద ఉద్ధృతిని తగ్గించవచ్చు. అలాగే ప్రధానంగా భూగర్భ జలాలు పెరుగుతాయి. మట్టి కోత తగ్గి సాగునీటి లభ్యత పెరుగుతుంది. దీంతో పంటల సాగు, దిగుబడులు పెరుగుతాయని స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: స్కూల్లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత
Follow Us On: Pinterest


