కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. భోజనం చేశాక తీవ్రంగా వాంతులు చేసుకోవడంతో టీచర్లు వారిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో ప్రస్తుతం విద్యార్థులకు వైద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆర్డీవో పార్థసింహారెడ్డి పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ తో తమ పిల్లలకు ఇబ్బంది కలగడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పిల్లల్ని చూసేందుకు ఎల్లారెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు.
Read Also: కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్‌గా కవ్వంపల్లి
Follow Us On: Sharechat


