గంజాయి రవాణా చేస్తే జైలుకే.. ఖమ్మం పోలీసులు వార్నింగ్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు (Khammam Police) ఉక్కుపాదం మోపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. మధిర టౌన్ సీఐ డి. రమేశ్, ఎస్‌ఐలు కిషోర్ కుమార్, నవిత, ఇతర పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

​పట్టణంలోని ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, స్థానిక హోటళ్లతో పాటు పాఠశాలలు, కళాశాలల సమీపంలోని పాన్ షాపులు, చాయ్ కొట్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ రవాణాకు ఆస్కారం ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కొరియర్ సర్వీస్ స్టాక్ పాయింట్లలో ఖమ్మం నుంచి రప్పించిన స్పెషల్ నార్కోటిక్ డాగ్ హ్యాండ్లర్ రవి బృందంతో ప్రతి మూలనూ జల్లెడ పట్టారు.

​ఈ సందర్భంగా సీఐ డి. రమేశ్ మాట్లాడుతూ.. మధిర పరిధిలో గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేసినా, అమ్మకాలు జరిపినా, రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ​గంజాయి, మత్తు పదార్థాల వాడకంపై ఎలాంటి సమాచారం తెలిసినా 8712659160 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>