నిరుద్యోగులకు, నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ (AP Cabinet) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులు, నేతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ కింద రూ.25 వేలు చొప్పున ఆర్థికసాయం అందించేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కొనసాగింపుకు ఆమోదముద్ర వేసింది.

పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధుల మంజూరుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వినికిడి లోపం ఉన్నవారికి బాపట్లలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. నంద్యాలలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపిన ఏపీ క్యాబినెట్.. పుట్టపర్తిలో ఏరో‌స్పేస్ కేంద్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడం వంటి అంశాలకు ఆమోదం లభించింది. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుపై ఆర్డినెన్స్‌కు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35 శాతం సీట్ల ప్రభుత్వ కోటాకు మంత్రి మండలి ఓకే చెప్పింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు భూముల కేటాయింపును చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>