సర్పంచ్ భర్త కిడ్నాప్ కేసు.. నిందితులు అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ముదిగొండ (Mudigonda) మండలం పండ్రేగుపల్లి గ్రామ సర్పంచ్ భర్త పాము సిల్వరాజును కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన నిందితులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 25వ తేదీన వాకింగ్ వెళ్లిన సిల్వరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు ముదిగొండ (Mudigonda) పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ అయిన గంటల వ్యవధిలోనే సిల్వరాజును కనిపెట్టారు. అయితే, కిడ్నాప్ కు పాల్పడిన నిందితుల పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ కు పారిపోతున్న 10 మంది నిందితులను తెల్దారుపల్లి టోల్ ప్లాజా వద్ద గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక అశోక్ లేల్యాండ్ ట్రక్కు, ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, లక్ష రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు ముస్తఫా, ఫక్రుద్దీన్, ఖాసిం, బాబా, ఇస్మాయిల్, తరుణ్ తదితరులను విచారించగా అసలు నిజం భయటపడింది. భూ వివాదాల నేపథ్యంలో షేక్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి సిల్వరాజును చంపడానికి రూ.15 లక్షలు సుపారీ మాట్లాడాడని, అందులో భాగంగా రూ.5 లక్షలు అడ్వాన్స్ తీసుకుని కిడ్నాప్ చేసి చంపాలని ప్రయత్నించామని నిందితులు వెల్లడించారు. కాగా, వారం రోజుల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన ముదిగొండ పోలీసులను ఏసీపీ తిరుపతి రెడ్డి అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>