ఖమ్మం ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ‘యాప్’ ఉంటేనే ఇసుక!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) ప్రజలు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇసుకను యాప్ ద్వారా బుక్ (Sand Booking App) చేయాల్సిందే. ఎందుకంటే ఇసుక సక్రమ సరఫరా కోసం ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ మొబైల్ యాప్‌ను ఇప్పటికే రూపొందించింది. సామాన్యులు వినియోగించేలా యాప్‌ను డిజైన్ చేశారు. గతంలో ఫిజికల్ కూపన్ ద్వారా ఇసుక తరలింపు జరిగేది. కానీ దీనివల్ల అవకతవకలు జరిగే ఆస్కారం ఉండేది. ఈ కారణంగానే అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం యాప్ ప్రవేశపెట్టింది. దీంతో ఇసుకకు సంబంధించిన ప్రతి అంశం ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది.

లబ్ధిదారులు సమర్పించిన దరఖాస్తు మేరకు ప్రత్యేకమైన క్యూ ఆర్ కోడ్ వస్తుంది. దాని ప్రకారం సంబంధిత లబ్ధిదారులకు సరైన సమయంలో డెలివరీ అవుతుంది. ఇక నుంచి ఇసుక సరఫరా కోసం ఫిజికల్ కూపన్లు జారీ చేయడానికి వీలు లేకుండా జిల్లా కలెక్టర్ తహసీల్దార్లకు ప్రత్యేకమైన సర్కులర్  జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడబోతోంది. యాప్ (Sand Booking App) నిబంధన రావడంతో అక్రమార్కులు ఏవిధంగా వ్యవహరిస్తారు అనేది చర్చనీయాంశమవుతోంది.

Read Also: సొంతపార్టీపై నిప్పులు చెరిగిన రాములమ్మ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>