Mobile Popup Ad
Mobile Popup Ad

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నాయకుడు మృతి

కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట (Suryapet) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు జావీద్ అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని పిల్లలమర్రి శివారులో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. జావీద్ ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జావీద్ మృతి పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>