పెన్షనర్ల విహారయాత్రకు ఎమ్మెల్యే సొంత ఖర్చుతో సహాయం

కలం, మెదక్ బ్యూరో :  సాధారణంగా వైద్య ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు, చదువులు లేదా శుభకార్యాల కోసం సహాయం చేసే ప్రజాప్రతినిధులను చూస్తుంటాం. కానీ పటాన్ చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) మాత్రం విభిన్నంగా ఆలోచించి పెన్షనర్ల కోసం ప్రత్యేక సహాయం చేశారు. రామచంద్రపురం ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం సభ్యులు కాశీ, అయోధ్య, ఢిల్లీ సహా ఉత్తర భారతదేశ విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకోగా, వారి ప్రయాణ ఖర్చుల కోసం ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి రూ.15 లక్షలు అందజేశారు. అనంతరం ఈ విహారయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Gudem Mahipal Reddy) మాట్లాడుతూ.. జీవితాంతం కష్టపడి సేవలందించిన పెన్షనర్లు సమాజానికి మార్గదర్శకులని కొనియాడారు. ఎంతో అనుభవం కలిగిన పెన్షనర్లు నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. గత పదేళ్లుగా తాను పెన్షనర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు, వారికి సొంత భవనం కూడా నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. ఈ విహారయాత్రకు వెళ్లే పెన్షనర్లు సంతోషంగా ప్రయాణించి మధురానుభూతులతో సురక్షితంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. విహారయాత్ర కోసం భారీ మొత్తంలో సొంత డబ్బులు అందజేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పెన్షనర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు .

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>