విజ‌య్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ‌నాడు సీఎం, స్టార్ హీరో విజ‌య్ (Vijay) అభిమానుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన న‌టించిన చివ‌రి సినిమా జ‌న నాయ‌గ‌న్ (Jana Nayagan) విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు. జూలై 23న ఈ సినిమాను ప్ర‌పంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన ఈ సినిమాకు హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూజా హెగ్డే, మ‌మితా బైజు విజ‌య్ స‌ర‌స‌న న‌టించారు.

జ‌న నాయ‌గ‌న్‌ (Jana Nayagan) త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ముందు సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ సంబంధిత అడ్డంకులతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక నేడు విజ‌య్ త‌న సోష‌ల్ మీడియాలో కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేస్తూ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. దీంతో విజ‌య్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ‌లేషియాలో నిర్వ‌హించిన ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్య‌క్ర‌మంలో విజ‌య్ ఇదే త‌న చివ‌రి సినిమా అని ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

Read Also: సహజీవనం చేస్తున్నారా.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>