సీఎం రేవంత్‌కి పవన్ కళ్యాణ్ కీలక లేఖ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక లేఖ రాశారు. చిన్నారుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పొక్సో (POCSO) చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఈ లేఖలో కోరారు. పోక్సో కేసులకు సంబంధించి విచారణ ప్రక్రియకు ఒక నిర్దిష్ట కాల పరిమితిని విధించాలని, ఇలాంటి కేసుల్లో నిందితులకు లభించే బెయిల్‌ను ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించాలని సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

ఈ లేఖతో పాటు ఏపీ సీఎస్, డీజీపీకు కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. పోక్సో కేసుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలన్నారు. బాధితులకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. చిన్నారులపై జరిగే అకృత్యాలపై 30 రోజుల్లోనే సమగ్ర విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు మరింత భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.

Read Also: సర్‌ ను లైట్ తీసుకుంటే అంతే.. బండి సంజయ్ వార్నింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>