గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా మనోహరాబాద్ (Manoharabad) మండలంలో అక్రమ ఎల్పీజీ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం (LPG Fire Accident) సంభవించింది. మనోహరాబాద్ మండలం పార్కిబండ శివారులోని ఒక గోదాంలో గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పెద్ద గ్యాస్ సిలిండర్ల నుండి చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీకైంది. క్షణాల వ్యవధిలోనే మంటలు అంటుకుని గోదాం మొత్తం వ్యాపించాయి.

చూస్తుండగానే భారీ అగ్నికీలలు ఎగసిపడటంతో గోదాంలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తూప్రాన్ పరిధిలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. బాధితుల్లో ఇద్దరు కార్మికులు తీవ్రంగా కాలిపోవడంతో వారి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది.

Read Also: సహజీవనం చేస్తున్నారా.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>