Mobile Popup Ad
Mobile Popup Ad

కాలువ పూడికతీత పనులు పరిశీలించిన ఖమ్మం కలెక్టర్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా వైరా మండలం సాన్నాల లక్ష్మీపురం గ్రామం, కొణిజర్ల మండల కేంద్రంలో కొనసాగుతున్న లింక్ కాలువ పూడికతీత పనులను కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించిన కూలీలతో మాట్లాడారు. వేతనాలు సకాలంలో అందుతున్నాయా.. లేదా.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మస్టర్ కార్డులను, హాజరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కూలీల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి పనిని ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫొటో క్యాప్చరింగ్ చేస్తూ జియో ట్యాగింగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. అధిక సంఖ్యలో కార్మికులను సమీకరించి పనులు నిర్వహిస్తే అదనపు కాంపోనెంట్ నిధులు పొందే అవకాశం ఉందన్నారు. ఎంపీడీవోలు పనుల అమలు, పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే జిల్లాలో మహిళా సంఘ భవనాల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పని స్థలాల్లో షేడ్ నెట్లు ఏర్పాటు చేసి తగిన నీడ కల్పించడంతో పాటు తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో కొణిజర్ల, వైరా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>