కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala) లోని బస్సులో ఓ యువతిపై లైంగిక వేధింపుల (Harassment) ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పక్క సీటులో కూర్చొని ఉన్న యువతిని అసభ్యంగా టచ్ చేస్తూ వేధించాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆ వ్యక్తి వినకపోవడంతో.. యువతి ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసింది. వీడియోలో యువతి ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించి తగిన గుణపాఠం చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా.. యువతి ధైర్యవంతమైన చర్యకు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
Read Also: పెంపుడు కుక్క విషయంలో గొడవ.. పెళ్లి రద్దు
Follow Us On : WhatsApp


