Mobile Popup Ad
Mobile Popup Ad

మగధీర సీన్ రిపీట్.. హెలికాప్టర్‌ ఎగురుతుండగా వేలాడిన వ్యక్తి!

కలం, వెబ్​ డెస్క్​: మగధీర సినిమా చూసిన చాలామందికి హెలికాప్టర్​ సీన్​ కచ్చితంగా గుర్తుకుంటుంది. హీరోయిన్​ కోసం హీరో ఎగురుతున్న హెలికాప్టర్​ను పట్టుకొని సాహసం చేస్తాడు. రియల్​ లైఫ్​లో అలాంటివి సాధ్యమవుతాయా అంటే నో అని చెప్పాలి. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం సినిమా హీరో మాదిరిగా ఎగురుతున్న హెలికాప్టర్​ను పట్టుకొని సంచలనం రేపాడు. కెన్యాలో (Kenya) చోటుచేసుకున్న ఈ విచిత్రమైన ఘటన సినిమా సీన్‌ను తలపించింది.

వివాహ వేడుకకు హాజరైన ప్రముఖులను తీసుకెళ్లేందుకు వచ్చిన హెలికాప్టర్‌లోకి అతన్ని అనుమతించలేదు. ఆ వ్యక్తి పట్టుదలతో ఆ విమానం గాలిలోకి ఎగురుతున్నా దాని కింది భాగంలో ఉన్న స్కిడ్స్ పట్టుకుని వేలాడాడు. గాలిలో ప్రయాణిస్తూ చేసిన ఈ సాహసం అక్కడి వారిని భయాందోళనకు గురిచేసింది. విమాన భద్రతా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లయింది. ప్రాణాలకు తెగించి అతడు చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యింది. కాగా దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన మగధీర సినిమాను గుర్తు చేసినప్పటికీ, చివరకు అతన్ని జైలుపాలు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>