భానుడి భగభగలు.. తగలబడుతున్న వాహనాలు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో భానుడి భగభగలకు వాహనాలు దగ్ధమవుతున్నాయి. ఇటీవల మణుగూరు సింగరేణి కోల్ ప్లాంట్ వద్ద బొగ్గు లోడింగ్ కోసం నిలిచి ఉన్న టిప్పర్ లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. ఎండ తీవ్రత వల్లనే షార్ట్ సర్క్యూట్ అయిందని తెలుస్తోంది. తాజాగా చర్ల మండలం బోధనెల్లి శివారులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. వరి కోతలు కోస్తున్న సమయంలో మిషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో యంత్రం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ మిషన్ సత్యనారాయణపురానికి చెందిన రాంపండుది.

ఎండలో నిరంతరాయంగా పనిచేస్తున్నందు వల్లనే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది. దాదాపు 10 రోజుల వ్యవధిలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వాహనాలు ప్రమాదాల బారిన పడ్డాయి. ఎండలో వాహనాలను ఎక్కువసేపు నిలుపొద్దని, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించొద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు.

Read Also: భర్తపై కోపం.. కోట్లు వెదజల్లిన మహిళ, వైరల్ వీడియో.. !

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>